కళ్యాణదుర్గం శ్రీ విరక్తి గవి మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జోన్-IV ప్రభుత్వ కళాశాల ఆర్ జెడిసిసిఈ డాక్టర్ నాగలింగారెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో హాజరు గురించి చర్చించారు. తదనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా కళాశాలకు హాజరు కావాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జయరామిరెడ్డి, లెక్చరర్లు పాల్గొన్నారు.