అల్పపీడనం.. 23న భారీ వర్షాలు
బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖలోని వాతావరణకేంద్రం ఆదివారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, రాయలసీమ, ప్రకాశంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, కోనసీమ, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.