పెందుర్తి: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
పల్లె పండుగ కార్యక్రమంలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ ఎం శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెందుర్తి మండలం సరిపల్లి, జంగాలపాలెం గ్రామాల్లో పర్యటించి సిసి రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనకాపల్లి జిల్లాకు 851 గోకులం షెడ్లు మంజూరైనట్లు తెలిపారు.