పెందుర్తి: 30 షాపులకు అనుమతులు మంజూరు
పెందుర్తి మండల పరిధిలో బాణసంచా విక్రయాలకు 30 షాపులకు అనుమతులు మంజూరైనట్లు సీఐ సతీష్ కుమార్ మంగళవారం తెలిపారు. మరో 10 దుకాణాలకు అనుమతులు మంజూరు చేయాలని దరఖాస్తులు వచ్చాయన్నారు. పెందుర్తి జంక్షన్ సమీపంలో నూకంబిక ఆలయ ప్రాంగణంలోను పాపయ్యరాజుపాలెం బీఆర్టీఎస్ ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బాణసంచా షాపులు ఏర్పాటు చేసే వ్యాపారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.