మీ నాయకత్వంలో అందరం పనిచేస్తాం
విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన డోలా బాల వీరాంజనేయులు నాయకత్వంలో జిల్లాలో అందరం చిత్తశుద్ధితో పనిచేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో కూటమి శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.