పెందుర్తి: గత ప్రభుత్వం ఇచ్చిన భూమి స్వాధీనం
పెందుర్తి కేంద్రంగా గల విశాఖ శ్రీశారదా పీఠానికి గత ప్రభుత్వం భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. రూ. 220 కోట్లు విలువైన 15 ఎకరాల భూమిని రూ. 15 లక్షలకు పీఠానికి గత ప్రభుత్వం కేటాయించింది. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.