దువ్వాడ: జనవరి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
విశాఖ నగరంలో జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు సోమవారం తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ 88వ వార్డు పరిధిలో పెదనరవ ప్రాంతంలో షాపుల యజమానులకు సోమవారం అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వల్ల ప్రజలకు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. దీనికి దూరంగా ఉండాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.