వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పవన్ కీలక వ్యాఖ్యలు
శాసన మండలిలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై తీవ్ర చర్చ జరిగింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా.. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. "ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవడం మా లక్ష్యమని" ప్రకటించారు. ఇదే విషయమై తాను కేంద్రమంత్రి అమిత్‌షాను కూడా కలిశానని, ప్రైవేటీకరణ చేయవద్దని కోరానని గురువారం పవన్ వెల్లడించారు.