తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం (ఆశా) ప్రతినిధుల బృందం గురువారం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌తో ఆయన నివాసంలో సమావేశమైంది. వివిధ డిమాండ్లపై ఓ వినతి పత్రాన్ని అందించింది. ప్రధానంగా తమ వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.