రావికమతం మండల ఎస్ఐగా రఘువర్మ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మొదటిసారి బుధవారం రావికమతం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాజాన, కొండ నాయుడు, ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో సన్మానించారు. ఆయనను కలిసిన వారిలో సర్పంచులు మోది నాయుడు, శంకర్రావు,శివ, ఎంపీటీసీలు నాగేశ్వరరావు గంజి సూర్యనారాయణ మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.