రాంబిల్లి ఎన్. ఏ. ఓ. బీ. రంగానికి చెందిన ఐటీడీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న బప్పుఖాన్ బుధవారం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు సీపీఎం మండల కార్యదర్శి జి. దేవుడు బాబు తెలిపారు. రెండు రోజుల కిందట కంపెనీలో మరో కార్మికుడు చనిపోయినా యజమాన్యం పట్టించుకోలేదన్నారు. మృతి చెందిన ఇద్దరు కార్మికులకు రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు.