విశాఖలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు
విశాఖలో రవాణా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించామని ఉపరవాణాశాఖ అధికారి రాజారత్నం తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేసి మూడు నెలలు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లైసెన్స్ రద్దు చేసిన తరువాత కూడా వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.