విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి సోమవారం బస్సులో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం జీవీఎంసీ అధికారులు సిబ్బంది సొంత వాహనాలు వదిలిపెట్టి షేర్ ఆటోలు బస్సుల్లో కార్యాలయానికి రావాలని తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సోమవారం బస్సులో కార్యాలయానికి వస్తున్నట్లు తెలిపారు. కాలుష్యం నివారణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.