ఎస్ రాయవరం: ఆయుష్ వైద్యం అవగాహన

60பார்த்தது
ఎస్ రాయవరం: ఆయుష్ వైద్యం అవగాహన
ఆయుష్ వైద్యంపై ఆశా కార్యకర్తలకు గురువారం ఎస్. రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ ఆయుర్వేదిక్, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో వైద్యం ద్వారా దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయవచ్చునని అన్నారు. దీనిలో భాగంగా గృహ వైద్యంపై ఆమె అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ వాసంతి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி