అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలో ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని 67. 35 కోట్ల రూపాయల వ్యయంతో 220 కేవీకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆన్లైన్లో శిలాఫలకం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, స్పీకర్ సతీమణి పద్మావతి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు.