ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు వినియోగించాలని, బహిరంగ మలవిసర్జన నివారించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం, చేతులు శుభ్రం చేసుకునేందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన సామాజిక దురాచారామన్నారు.