ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కో ఆపరేటివ్, డిసిసిబి, ఆప్కాబ్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహంచి కంప్యూటరీకరణ పనుల పురోగతిని సమీక్షించారు. కంప్యూటరీకరణ పనులు పూర్తిచేయకపోవడం, రాష్ట్ర స్థాయి సూచీలలో వెనుకబడటంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.