కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు నందు సీసీఐ వారు ఎల్1, ఎల్2, ఎల్3 పేరుతో మిల్లులలో రైతులకు పత్తి ఖరీదులో ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆదేశానుసారం సోమవారం జమ్మికుంట మార్కెట్ యార్డులో సీసీఐ ప్రైవేట్ పత్తి కొనుగోలు బందు చేస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఒక్క ప్రకటనలో తెలిపారు. కాటన్ రైతులు, పత్తి ఖరీదు వ్యాపారులు, గుమాస్తాలు,, హమాలీలు సహకరించాలని కోరుతున్నారు.