నారాయణఖేడ్: కలుషిత నీటి ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్

నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటలో కలుషిత నీరు తాగి అస్వస్థకు గురైన ఘటనపై విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్ డిమాండ్ చేశారు. నారాయణఖేడ్లో ఆదివారం సమావేశంలో ఆయన మాట్లాడారు. కలుషిత నీటి ఘటనకు కారణమైన పంచాయితీ కార్యదర్శి ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అస్వస్థతకు గురైన వారికి కార్పోరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி