నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ హత్యా రాజకీయాలను ప్రభుత్వం ఉపేక్షించదని జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదన్నారు. దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని అన్నారు.