ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేటకు చెందిన తలారి బాబు ఈనెల 16వ తేదీన రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఒక బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన బాబును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி