గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని సిపిఐ పట్టణ కార్యదర్శి కళిందర్ అలీ ఖాన్ ఆదివారం ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల అభివృద్ధిని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా అక్రమ కట్టడాలు తొలగిస్తూ రోడ్డు వెడల్పు చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.