జడ్చర్ల మున్సిపాలిటీ 14వ వార్డు సంజీవయ్య కాలనీలో గల మినీ ట్యాంక్ బండ్ లో దసరా నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ ఘాట్ నిమర్జనం ప్రదేశాన్ని ను బుధవారం మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఇంచార్జ్ మున్సిపల్ చైర్ పర్సన్ పాలాది సారిక పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలత, ఉమా శంకర్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు రామ్మోహన్, కోనేటి నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.