ఏపీ పోలీస్ శాఖ కీలక ప్రకటన

AP: ఏపీ పోలీస్ శాఖ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియా లో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెట్టవద్దు అని ఏపీ పోలీస్ శాఖ  వెల్లడించింది. తప్పుడు పోస్టులు చేసేవారిని పోలీసు యంత్రాంగం గమనిస్తూనే ఉంటుందని, వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, సామాజిక మాధ్యమాల్లో కుల, మత వర్గాల మధ్య విభేదాలు వచ్చేలా పోస్టులు పెట్టవద్దని విజయవాడ పోలీసులు ఒక ప్రకటనలో సూచించారు.

தொடர்புடைய செய்தி