మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 28, 29, 30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సును పండుగల నిర్వహించాలని మంగళవారం మంత్రుల సమావేశంలో అన్నారు. రైతు సదస్సు ఏర్పాట్లపై హైదరాబాద్ లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రైతు సదస్సులో ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను వివరించాలని సూచించారు.