జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో సోమవారం సాయంత్రం 3. 50 నుంచి వర్షం పడుతూనే ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. సుమారు గంటకు పైగా వర్షం పడుతుండడంతో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.