అలంపూర్ ప్రాంతంలో ఉన్న వరద బాధితులందరికీ ఫ్లాట్స్ అందించాలని గద్వాల్ జిల్లా కలెక్టర్ B.M సంతోష్ కి బీజేపీ అలంపూర్ మండల ప్రధాన కార్యదర్శి రంగస్వామి వినతిపత్రం సోమవారం అందజేశారు. అదే విధంగా, అలంపూర్ హాస్పిటల్లో పేషెంట్లకు ఇవ్వాల్సిన పాలు, బ్రెడ్, గుడ్డు వంటి ఆహారం సరఫరా చేయడం లేదని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా వారు వినతి పత్రంలో కోరారు.