దేవరకద్ర నియోజకవర్గంలోని పెండింగ్ పనులపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి శుక్రవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, ఆత్మకూర్ మండలాలకు సంబంధించిన విద్యుత్, వైద్యం పెండింగ్ పనుల గురించి ఆయా శాఖ ఉన్నత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.