మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బోథ్ మండలంలోని ఘన్ పూర్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం గురువారం తనిఖీ చేశారు. ఎన్నికల్లో ప్రభావితం చేసే పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, ఇతర బహుమతి వస్తువులను రవాణా కాకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ అధికారులు విధులను నిర్వహిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.