చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఒ ప్రబావతీదేవి పలమనేరు అర్బన్ పరిధిలోని పలు ప్రైవేట్ క్లినిక్ లను గురువారం తనిఖీ చేశారు. ప్రవేట్ క్లినిక్లు, నర్సింగ్ హోమ్ లు తప్పనిసరిగా ప్రభుత్వ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజలకు సేవలు అందించాలన్నారు. రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్పైర్ అయిన వారు రెన్యువల్ చేసుకోవాలని అలా చేసుకోని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని తెలిపారు. అలాగే ఆర్ఎంపి లు ప్రజలకు ప్రదమ చికిత్స మాత్రమే చేయాలని ఇంజక్షన్స్ మరియు సెలైన్ లాంటి వాటితో చికిత్స చేయరాదని అలా చికిత్స చేస్తే సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే లద్దిగం పిహెచ్సి సెంటర్ ను , హెల్త్ వెల్నెస్ సెంటర్ను మరియు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ను తనిఖీ చేసి అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను లక్ష్యం సాధించాలన్నారు. అలాగే యాప్స్ నందు 100% అప్లోడ్ చేయాలని తెలిపారు. సిబ్బంది అందరూ ఉదయం 9 నుండి సాయంతరం 4 గంటల వరకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. అత్యవసర కేసులను ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయాలని చెప్పారు.