14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రైతులకు చేసిన మేలేంటని మంత్రి ధర్మాన ప్రసాదరావు, కృష్ణ దాసులు ప్రశ్నించారు. సోమవారం నందిగాం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల గురించి ఎటువంటి ప్రాజెక్టులూ నిర్మించని తెలుగుదేశం నాయకులు నేడు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. నందిగామ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.