పలాస మండలం మొగిలిపాడు గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గుర్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న యాజమాని హిమాముద్దీన్ ఘటనా స్థలికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. నేషనల్ హైవే సిబ్బంది జేసీబీ సహాయంతో గుర్రాన్ని సమీప ప్రదేశంలో పూడ్చిపెట్టారు.