కాశీబుగ్గ: ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు'

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఉదయం డీఎస్పీ వి. వెంకట అప్పారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన, గంజాయి మత్తులో అధిక వేగంతో వాహనాలు నడిపినా చర్యలు తప్పవని అన్నారు. బైక్ దొంగతనాలు, చైన్ స్నాచర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.

தொடர்புடைய செய்தி