ఉరవకొండ: తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

ఉరవకొండ మండలం చిన్నముష్టూరు వద్ద తాగునీటి కోసం మహిళలు మంగళవారం రోడ్డెక్కారు. అనంతపురం-బళ్లారి వెళ్లే 42వ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలు రోడ్డుకు అడ్డం పెట్టి బైఠాయించి రాస్తారోకో చేశారు. నెల రోజులుగా కొళాయిలకు చుక్కనీరు కూడా రాలేదని, ఫిల్టర్ నీరు కొనలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని టీడీపీ నాయకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

தொடர்புடைய செய்தி