యల్లనూరు మండలంలో శనివారం పోలీసులు నాకా బంధీ చేపట్టారు. పుట్లూరు సీఐ సత్యబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు హేమాద్రి, రాంప్రసాద్ తన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలో గత రెండు నెలల క్రితం ఘర్షణకు పాల్పడ్డ ఇరు వర్గాలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఘర్షణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామంలో గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పారు.