పెనుగొండలో రక్తదానం చేసిన పోలీసులు

పెనుగొండ పట్టణంలో పోలీసులు గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా పెనుగొండ డీఎస్పీ వేంకటేశ్వర్లు, సీఐ రాఘవన్ ఆధ్వర్యంలో పోలీసులు రక్తదానం చేశారు. వారు మాట్లాడుతూ రక్తదానం ఇతరులకు ప్రాణదానంతో సమానమన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. పెనుగొండ ఎస్సై వేంకటేశ్వర్లు, రాజేష్, సోమందేపల్లి ఎస్సై, రొద్దం ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி