పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన్ హాల్ లో సోమవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల మహాసభల కార్యక్రమం నిర్వహించారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ జర్నలిస్టులకు త్వరలోనే మడకశిర నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా తాను ఒక అన్నగా తోడుంటానని ఆయన హామీ ఇచ్చారు.