ఆలూరు: వేతనాలు తగ్గింపు గురించి అడిగాం: ఎమ్మెల్యే

పవన విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు తగ్గించి ఇస్తున్నారని, ఆ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రతినిధి మంజునాథను ప్రశ్నించారే తప్ప తన అనుచరులు దాడులకు పాల్పడలేదని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆదివారం అన్నారు. ఈ ఘటనపై పోలీసులు నిజాలను తెలుసుకోవాలని కోరారు. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి తానుకట్టుబడి ఉన్నానని దౌర్జన్యాలకు పాల్పడేది ఎవరనేది ప్రజలకు తెలుసన్నారు.

தொடர்புடைய செய்தி