ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో పాసైన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వి. శ్రీనివాసరాజు తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఐటీఐ ఐఎంసీ చైర్మన్ సామంతపూడి బాలకృష్ణంరాజు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.