ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి జనసేనకి కేటాయించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు శనివారం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంటసాల వెంకటలక్ష్మి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అన్ని నామినేటెడ్ పదవులలో, ఉద్యోగాలలో జనసేనకి సముచిత స్థానం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.