108 సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం మైదుకూరు ఎంపీడీవో శ్రీధర్ నాయుడు, డిప్యూటీ తహశీల్దార్ అమరేశ్వరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ 108 పథకాన్ని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలన్నారు. వేతన స్లాబ్లను అప్డేట్ చేసి వేతనాలు పెంచాలన్నారు. గత 4 సంవత్సరాలుగా వేతన స్లాబ్లలో ఎలాంటి మార్పు లేదన్నారు.