పైడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదైన డెంగ్యూ వ్యాధిగ్రస్తుని గృహాన్ని శుక్రవారం వరంగల్ డిఎం హెచ్ఓ క్షేత్రస్థాయిలో పర్యటించి తగు ఆరోగ్యపర మైన సూచనలు చేశారు.
వైద్య సిబ్బంది మున్సిపల్ సిబ్బంది సహకారంతో చేపడుతున్న ఆంటీ లార్వెల్ ఆపరేషన్, పైరిత్రం స్ప్రే పనులను పరిశీలించారు. స్థానిక శివాలయం దగ్గర ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులను పరీక్షించారు.