హన్మకొండ నగరంలో వైద్యం వ్యాపారంగా కొనసాగుతున్న అధికారులు పట్టిచుకోవడం లేదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ ఆరోపించారు. సోమవారం 49వ డివిజన్, ప్రగతినగర్ లో ఆయన మాట్లాడుతూ నగరంలో పలువురు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకొని రోగులను దోచుకుంటున్నారన్నారు. వైద్య వ్యాపారం కోసం ప్రత్యేకంగా పిఆర్వోలను ఏర్పాటు చేసుకొని రోగులను తీసుకువచ్చే ఆర్ఎంపి, పీఎంపిలకు 25 నుంచి 35 శాతం కమిషన్ ఇస్తూ దందా చేస్తున్నారన్నారు.