చెత్త సేకరణ తరలింపు ప్రక్రియ విధిగా జరగాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి శానిటేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్ పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకుని సమర్థవంతంగా నిర్వహించుటకు తన సూచనలు చేశారు. చెత్త సేకరణ తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలన్నారు.