ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఆరేండ్ల నుంచి రూ. ఎనిమిది వేల కోట్లకుపైగా పెండింగ్ ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని పేర్కొన్నారు.