కాంగ్రెస్ పార్టీ నుండి తనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలి అని కాంగ్రెస్ బహిష్కృత కార్యకర్త మేడిపల్లి రాజు గౌడ్ అన్నారు. శనివారం నర్సంపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే మాధవరెడ్డి గెలుపు కోసం పనిచేసిన తనను నిర్ధాక్షిణంగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం బాధాకరమని తెలిపారు. తాను పార్టీ నియమాలను ఎక్కడ కూడా ఉల్లంఘించలేదని వాపోయాడు.