వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో హరితహారం పథకం కింద తీసుకొచ్చిన వేల మొక్కలు ఎండిపోయిన పరిస్థితుల్లో ఉండడంతో గురువారం బిజేపి నాయకులు కంబంపాటి పుల్లారావు పరిశీలించారు. నర్సంపేట మున్సిపాలిటీ అధికారి శ్రీధర్ పర్యవేక్షణలో ఉన్నటువంటి మొక్కలు వేల సంఖ్యలలో ఎండిపోతున్నాయని అధికారుల నిర్లక్ష్యంతో పథకం నీరుగారిపోతుందని అన్నారు. కార్యక్రమంలో బాల్నే జగన్ పాల్గొన్నారు..