మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీలో సీసీ రోడ్డు పోయకుండానే బిల్లులు డ్రా చేసి భారీ మొత్తం లో అవినీతి కి పాల్పడిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సీసీ రోడ్డు, చంద్రు తండాలో మరొక సీసీ రోడ్డు పనులు చేయకుండానే అధికారులు డబ్బులు కాజేసారు. ఈ ఘటన పై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.