జనగామ భ్రమరాంబ కన్వెన్షన్ హాల్ లో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కుల గణన పై సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయాలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి, యశ్విని రెడ్డి, జనగామ డీసీసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.