ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్ లతో కలిసి ఆయన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీదారుల సమస్యల గురించి తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.